ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటో.. సచిన్ పొరపాటు

సోషల్ మీడియా పుణ్యంతో చిన్నపాటి పొరపాటును కూడా భూతద్ధంలో పెట్టే చూస్తున్నారు. చిన్న తప్పు చేసినా.. వెంటనే నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ అనుభవం క్రికెట్ దేవుడికి తప్పలేదు. క్రికె

selvi| Last Updated: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:07 IST)
సోషల్ మీడియా పుణ్యంతో చిన్నపాటి పొరపాటును కూడా భూతద్ధంలో పెట్టే చూస్తున్నారు. చిన్న తప్పు చేసినా.. వెంటనే నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ అనుభవం క్రికెట్ దేవుడికి తప్పలేదు. క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఓ చిన్న పొరపాటు చేశారు.
  

తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటోను ఆయన పోస్టు చేయగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన పోస్టులను తొలగించాల్సి వచ్చింది. 
 
ఏమైందంటే..? ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా ఉన్న ఆకాశ్ చోప్రా పుట్టినరోజును పురస్కరించుకుని, సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందనలు తెలిపారు. అయితే, ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటోను పెట్టారు. 
 
దాని కింద కామెంటేటర్, హోస్ట్, అనలిస్ట్, ఆథర్, గొప్ప ఓపెనర్ అంటూ తన స్నేహితుడైన ఆకాశ్ చోప్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ చేసిన ఈ పొరపాటుపై నిమిషాల్లో నెటిజన్లు స్పందించారు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. అంతేకాదండోయ్ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆపై తన ట్వీట్‌ను సచిన్ డిలీట్ చేశాడు. దీనిపై మరింత చదవండి :