గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (19:29 IST)

ఐసీసీకి శశాంక్ మనోహర్ రాజీనామా.. ట్విట్టర్లో రచ్చ రచ్చ..

ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల మనోహర్ కేవలం ఎనిమిది నెలలు ఆ పదవిలో ఉండిన అనూహ్యంగా ఐసీసీ ఛైర్మన్‌కు వద్దనుకున్నారు. కానీ అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదన

ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల మనోహర్ కేవలం ఎనిమిది నెలలు ఆ పదవిలో ఉండిన అనూహ్యంగా ఐసీసీ ఛైర్మన్‌కు వద్దనుకున్నారు. కానీ అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదని ఓ ఐసీసీ అధికారి వెల్లడించారు. ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్‌కు శశాంక్‌ తన రాజీనామా లేఖను పంపించారని తెలిపారు. శ్రీనివాసన్ నుంచి శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే.
 
ఐసీసీ ఛైర్మన్‌గా మే, 2016న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్‌ చైర్మన్‌గా నిలిచారు. స్వతహాగా లాయర్ అయిన శశాంక్ మనోహర్ గతంలో రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.
 
అనంతరం ఆయన ఐసీసీ ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఏడాది కూడా ముగియకుండానే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ట్విట్టర్లో శశాంక్ మనోహర్ రాజీనామాపై రచ్చ రచ్చ సాగుతోంది. శశాంక్ రాజీనామాపై విభిన్నాభిప్రాయాలు నమోదవుతున్నాయి.