మంగళవారం, 11 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 నవంబరు 2025 (22:33 IST)

స్మృతి మందనాను అభినందించిన కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (video)

Palash Muchhal and Smriti Mandanna
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన నేపధ్యంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాపై జట్టు ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత, పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన కాబోయే భార్య, టీమ్ ఇండియా ఉమెన్ వైస్ కెప్టెన్ స్మృతి మందనా ట్రోఫీని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ, “సబ్సే ఆగే హై హమ్ హిందుస్తానీ” అని క్యాప్షన్ పెట్టారు.
 
స్మృతి మందనా, పలాష్ ముచ్చల్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని వీరిరువురూ ఇదివరకే వెల్లడించారు. నవంబరు 20వ తేదీన వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.