శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (11:46 IST)

ఫీల్డింగ్‌లో గాయపడిన యువరాజ్ సింగ్... ఛాంపియన్ ట్రోఫీకి దూరమా?

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై జరిగే చాంపియన్ ట్రోఫీకి యువరాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రస్తుతం స్వదేశంలో ఐపీఎల్ పదో స

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై జరిగే చాంపియన్ ట్రోఫీకి యువరాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా?  అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రస్తుతం స్వదేశంలో ఐపీఎల్ పదో సీజన్ పోటీలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ పోట్లీల్లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా చేతికి గాయమైంది. దీంతో మైదానం వీడాడు. 
 
టాస్ ఓడిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ చేపట్టగా, ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది. తొలివికెట్ వేగంగా కోల్పోవడంతో బరిలోదిగిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడసాగాడు. ఈ మ్యాచ్‌లో రాణించిన రోహిత్ శర్మ బలంగా కొట్టిన షాట్‌ను యువరాజ్ సింగ్ అడ్డుకున్నాడు. దీంతో వేగంగా దూసుకొచ్చిన బంతి యువీ చేతిని గాయపరిచింది. 
 
ఫలితంగా యువీ మైదానం వీడాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగినా కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అవుటైన అనంతరం చేతిని చూసుకుంటూ యువీ మైదానం వీడాడు. అయితే గాయం పెద్దది కాదని, తర్వాతి మ్యాచ్ లకు యువీ అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది.