గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (11:58 IST)

భారత్‌లో మూడో "సిక్సర్ల" వీరుడు సురేష్ రైనా

పొట్టి క్రికెట్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన సురేష్ రైనా మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. శ్రీలంక వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేష్ రైనా సిక్సర్ సాయంతో 27 బంతుల్

పొట్టి క్రికెట్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన సురేష్ రైనా మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. శ్రీలంక వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేష్ రైనా సిక్సర్ సాయంతో 27 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌ సాయంతో ట్వింటీ20 మ్యాచ్‌లలో సురేష్ రైనా మొత్తం 50 సిక్సర్లు కొట్టిన మూడో భారతీయ క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. 
 
ఈ జాబితాలో ఇప్పటివరకు 74 సిక్సర్లతో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 69 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా చూస్తే విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
 
కాగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ట్రోఫీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత్ ఈనెల 12న మరోసారి శ్రీలంకతో తలపడనుంది.