శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:40 IST)

నేను బతికే ఉన్నా బాబోయ్ అంటున్న భారత క్రికెటర్

భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకరు. ఫామ్ లేమితో ఉన్న సురేశ్ రైనా.. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అదేసమయంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో సురేష్ రైనా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సురేష్ రైనా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వదంతులపై సురేశ్ రైనా స్పందిస్తూ, 'కారు ప్రమాదంలో నేను మరణించినట్లు కొన్ని అసత్య వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. వీటి ద్వారా నా కుటుంబసభ్యులు, స్నేహితులు చాలా భయాందోళనకు గురయ్యారు. అలాంటి వార్తలను అసలు నమ్మకండి. భగవంతుని దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూట్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది' అని రైనా ట్వీట్ చేశాడు.
 
కాగా, బతికుండగానే మనిషిని చంపేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ కొంతమంది రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటివారు ఇపుడు సురేశ్ రైనాను రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.