సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:09 IST)

ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...

అమెరికాలో ఇప్పటికే నకిలీ వర్శిటీ పేరుతో ఫర్మింటన్ వర్శిటీని మూసివేసి 130 మంది తెలుగు విద్యార్థులపై కేసులు పెట్టి వారిని ముప్పుతిప్పలు పెడుతున్న అమెరికా ప్రభుత్వం ఇటువంటి వర్శిటీలను ఇంకా గుర్తించి వాటిని కూడా మూసివేయాలని భావిస్తోంది. ఇదే కనుక చేస్తే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
 
తాజాగా మరో ఐదు నకిలీ వర్శిటీలను గుర్తించి వాటిని కూడా మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే దాదాపు 80 వేల మంది విద్యార్థులు అమెరికాను వదిలివేయాల్సి రావడమే కాకుండా వారు ఇతరత్రా న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ ఐదు వర్శిటీలలో చదువుతున్న 80 వేలమందిలో 50 వేలమంది విద్యార్థులు భారతీయులు కావడం గమనార్హం.
 
ఇది ఇలావుండగా అమెరికాలో ఉంటున్న వలసదారులు ఈ నెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేయడంతో అక్కడ ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రత్యర్థులకు ఇవి ఆయుధాలుగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.