విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు!!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్ అచ్చుగుద్దినట్టుగా దింపేశాడు. సాధారణంగా ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు వ్యక్తలు ఉంటారన్న నానుడి ఉంది. ఇపుడు ఈ తుర్కియే నటుడు అచ్చం విరాట్ కోహ్లీలా ఉండటంతో ఈ నానుడి నిజమయ్యేలా వుంది. ఇదివరకే ఇద్దరు వ్యక్తులు కోహ్లీని పోలివుండటం గమనార్హం.
గతంలో కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ.. విరాట్ కోహ్లీతో సెల్పీ దిగాడు. ఆ తర్వాత ఆయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా అచ్చం కోహ్లీలా ఉండే వ్యక్తి తారసపడటం విశేషం.
తుర్కియేకు చెందిన నటుడు సెవిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ "దిరిలిస్: ఎర్టుగ్రుల్" కావిట్ సెటిన్ నటించాడు. ఆ సిరీస్‌లోని ఒక సన్నివేశంలో కావిట్ ఉన్న స్క్రీన్ షాట్‌ను ఓ రెడిట్ యజమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనుష్క శర్మ భర్త టీవీ రంగప్రవేశం అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఇది చూసిన నెటిజన్లు, కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కోహ్లీ టీవీ సిరీస్‌లో నటిస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.