వామికా కోహ్లీతో స్విమ్మింగ్ పూల్ వద్ద కోహ్లీ ఫోటో  
                                       
                  
                  				  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కుమార్తె ఫోటోను నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, విరాట్ కోహ్లీ తన కుమార్తె వామికా కోహ్లీతో స్విమ్మింగ్ పూల్ వద్ద వున్న ఫోటోను పోస్టు చేశాడు. వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ వద్ద వెనుక తిరిగి వున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
 				  											
																													
									  
	 
	విరాట్ బ్లూ స్విమ్‌వేర్, లేత గోధుమరంగు టోపీని ధరించగా, వామిక ఆక్వా బ్లూ- పింక్ స్విమ్‌సూట్‌ను ధరించింది. ఒకరికొకరు పక్కన కూర్చున్నప్పుడు, విరాట్ ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు.
				  
	 
	కాగా... సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియా ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో అనుష్క శర్మ విరాట్‌ను ఉత్సాహపరుస్తున్న ఫోటోలను అభిమానులు పంచుకున్నారు. రెడ్ హార్ట్ ఎమోజీతో కూడిన తమ పూల్ ఫోటోకు విరాట్ క్యాప్షన్ ఇచ్చాడు.