సచిన్‌ను దాటిపోయిన విరాట్ కోహ్లీ.. టాస్ ఓడిపోవడంలోనూ రికార్డే...
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధికమించాడు. ఇంతకాలం సచిన్ పేరిట ఉన్న సెంచరీల రికార్డును కోహ్లీ చెరిపేశాడు. అంటే.. ఛేజింగ్‌లో సుమా.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధికమించాడు. ఇంతకాలం సచిన్ పేరిట ఉన్న సెంచరీల రికార్డును కోహ్లీ చెరిపేశాడు. అంటే.. ఛేజింగ్‌లో సుమా.
వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లి.. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విండీస్‌పై ఐదో వన్డేలో చేసిన సెంచరీ విరాట్ (111 నాటౌట్)కు ఓవరాల్‌గా 28వది కాగా.. చేజింగ్‌లో 18వ సెంచరీ కావడం విశేషం. దీంతో ఛేజింగ్‌లో ఇన్నాళ్లూ సచిన్ (17) పేరిట ఉన్న రికార్డు మరుగున పడిపోయింది.
అయితే, ఈ సెంచరీలు చేయడానికి ఈ ఇద్దరూ ఆడిన ఇన్నింగ్స్‌లో కూడా చాలా తేడా ఉంది. సచిన్ చేజింగ్‌లో 17 సెంచరీలు చేయడానికి 232 ఇన్నింగ్స్ ఆడగా.. విరాట్ మాత్రం కేవలం 102 ఇన్నింగ్స్‌లోనే 18 సెంచరీలు చేయడం విశేషం. ఈ ఇద్దరి తర్వాత ఛేజింగ్‌లో 11 సెంచరీలతో శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు.
అంతేకాకుండా, టాస్‌ను ఓడిపోవడంలోనూ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ముఖ్యంగా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో విరాట్ వరుసగా టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. ఇలా వన్డేల్లో వరుసగా టాస్ ఓడిపోయిన భారత కెప్టెన్లలో విరాట్ నాలుగో వాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల్లో భారత్ విజయం సాధించడాన్ని పక్కన పెడితే, విరాట్ ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్ గెలవలేదు.
ఇప్పటివరకు విరాట్ నాయకత్వం వహించిన 30 వన్డేల్లో కేవలం 13 మ్యాచుల్లో మాత్రమే టాస్ గెలిచాడు. ధోనీ నాయకత్వం వహించిన సమయంలో 199 వన్డేల్లో 97 టాస్‌లు గెలిచాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ధోనీ కూడా వరుసగా టాస్ ఓడిపోయాడు.
జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అప్పటి కెప్టెన్ అజింక్య రహానే కూడా వరుసగా టాస్ ఓడిపోయాడు. ఈ వరుసగా టాస్ ఓడిపోయే పరంపరను మొదలు పెట్టింది సునీల్ గవాస్కర్. 1984-85లో ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో సునీల్ వరుసగా టాస్ ఓడిపోయాడు.