బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (11:51 IST)

విదేశీ ఆటగాళ్ల తిట్లలో చాలా ఫన్ ఉంటుంది : వీరేంద్ర సెహ్వాగ్

క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు చిన్నచిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని భారత డాషింగ్ మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటంపై

క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు చిన్నచిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని భారత డాషింగ్ మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటంపై సెహ్వాగ్ స్పందిస్తూ... కోహ్లీ కెప్టెన్సీ ఎంతో బాగుంటుందని, మైదానంలో తన మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో ఏ మాత్రమూ సంకోచించడన్నాడు. 
 
మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను తిట్టి వారి ఏకాగ్రతను చెడగొట్టడం వ్యూహంలో ఓ భాగమేనని, అలా తిట్టుకుంటుంటే అదో ఆనందమని అన్నాడు. తన 14 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో మార్లు విదేశీ ఆటగాళ్లతో తిట్లకు గురైన సెహ్వాగ్, అందులో చాలా ఫన్ ఉంటుందని, అయితే, పరిధులు దాటని స్లెడ్జింగ్‌కే తాను పరిమితమన్నాడు. 
 
రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిన్న చిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. త్వరలో జరిగే ఇండియా - ఆస్ట్రేలియా సిరీస్‌లో స్లెడ్జింగ్ ఓ భాగం కానుందని, రెండు దేశాల కెప్టెన్లు కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లు గతంలో ఎన్నోమార్లు తిట్టుకున్నారని గుర్తు చేశాడు.