శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (16:58 IST)

ధోనీ ఫోటోను గీసిన సెహ్వాగ్ తనయుడు.. జై నటరాజ్ అంటూ సెహ్వాగ్ ట్వీట్

టీమిండియా మూడు ఫార్మాట్‌లకు స్వస్తి పలికి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోను... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిత్రీకరించాడు. తన తండ్రి విధ్వంసక క్రికెటర్‌ అయినప్పటికీ వీర్

టీమిండియా మూడు ఫార్మాట్‌లకు స్వస్తి పలికి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోను... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిత్రీకరించాడు. తన తండ్రి విధ్వంసక క్రికెటర్‌ అయినప్పటికీ వీర్‌కి ధోని అంటే ఎక్కువ ఇష్టమట. అయితే తన అభిమానాన్ని వినూత్నంగా వెల్లడించాడు. ధోని బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటో మాదిరి చిత్రాన్ని పెన్సిల్‌తో తెల్ల కాగితంపై చిత్రించాడు. ఆర్యవీర్‌ గీసిన ఈ చిత్రాన్ని సెహ్వాగ్‌ తన ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్‌కు మంచి గుర్తింపు సంపాదించిపెట్టిన ధోనీ.. తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో టీ20, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలను భారత్‌కు సాధించి పెట్టిన గొప్పసారిథిగా పేరు కొట్టేశాడు. అలాంటి స్టార్‌ క్రికెటర్‌కు చిన్నా పెద్దా తేడా లేకుండా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. వీరిలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ కూడా ఒకడని సెహ్వాగ్ ట్విట్టర్లో తెలిపాడు. ఇంకా ధోనీ బ్యాటింగ్ నటరాజ స్వామిలా ఉందని కూడా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.