ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:59 IST)

భార్య బేబీ బంప్ పైన ఆండ్రూ రస్సెల్ సుతిమెత్తగా చేయి వేసి... (Video)

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఆండ్రూ రస్సెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్.. మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాంటి వ్యక్తి తన భార్య బౌలింగ్ చేయగానే రంగుల వర్షం కురిపించాడు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి. ఆండ్రూ రస్సెల్ తన చేతిలో బ్యాటును పట్టుకుని తన భార్యను బౌలింగ్ చేయమన్నాడు. 
 
కానీ ఆమెకు బౌలింగ్ చేయడం ఎలాగో తెలియక అయోమయంలో పడింది. అప్పుడు రస్సెల్ ఆమెకు ఎలా బౌలింగ్ చేయాలో చూపెట్టాడు. చివరికి ఆ బంతిని ఆమె విసిరింది. ఆ బంతిని రస్సెల్ బాదగా ఒక్కసారి రంగులతో కూడిన మెరుపులు బయటకు వచ్చాయి. దీన్ని చూసిన రస్సెల్ భార్యతో పాటు అక్కడ అందరికీ ఒకటే సంతోషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అయినా ఈ వీడియోను రస్సెల్ ఎందుకు పోస్ట్ చేశాడా అని ఆలోచిస్తున్నారు కదూ.. అవును కారణం వుంది. ఆండ్రూ రస్సెల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన భార్య జాస్సిమ్ లోరా ప్రస్తుతం గర్భం ధరించింది. త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 
 
తన భార్య ప్రెగ్నెన్సీ వేడుకను ఆండ్రీ రస్సెల్ వినూత్నంగా జరిపాడు. కుటుంబ సభ్యుల మధ్య పార్టీ ఏర్పాటు చేసి ఇలా బ్యాటుతో తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. ప్రస్తుతం రస్సెల్ ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

So it's #GIRL