సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (16:42 IST)

పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆమెను వాడుకున్నాడా? గర్భవతిని కూడా చేశాడా?

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై హమీజా ముక్తర్ అనే ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా బాబర్ లైంగికంగా వాడుకుంటున్నాడని, గర్భవతిని కూడా చేశాడని ఆమె తెలిపింది. బాబర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సాయం చేశానని కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయమై బాబర్‌పై హమీజా ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. బాబర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఇదే విషయమై బాబర్‌ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హమీజా పిటిషన్‌పై గురువారం సెషన్స్‌ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్‌ తరపు లాయర్‌ మాట్లాడుతూ.. హమీజ్‌.. బాబర్‌పై అనవసర ఆరోపణలు చేస్తుంది.
 
కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతుందని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని కోర్టుకు తెలిపారు. బాబర్‌ అజమ్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని హమీజా తరపు లాయర్‌ కోర్టుకు స్పష్టం చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలు పరిశీలిస్తామని తెలిపి కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.