శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (14:51 IST)

ధోనీ భవిష్యత్.... మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంది : యూవీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై యువరాజ్ సింగ్ కూడా తనదైనశైలిలో స్పందించాడు. నాకేం తెలుసు బాస్.. మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. 
 
వాస్తవానికి ధోనీపై పలుమార్లు యువరాజ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇపుడు మరోమారు ధోనీ రిటైర్మెంట్‌పై కామెంట్స్ చేశాడు. ధోనీ భవితవ్యం ఎలా ఉండబోతోందంటూ ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 'నాకు తెలియదు బాస్. మన గ్రేట్ సెలెక్టర్లు మీకు ఎప్పుడైనా తారసపడితే... ఆ విషయాన్ని వారినే అడగండి. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. నేను కాదు' అని చెప్పాడు.
 
మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. సెలెక్టర్ల పని అంత తేలికైనది కాదన్నాడు. 15 మంది ఆటగాళ్లను జట్టులోకి సెలెక్ట్ చేసినప్పుడు... అర్హత కలిగిన మరో 15 మంది ఆటగాళ్లపై చర్చ జరుగుతుందని చెప్పాడు. ఆధునిక క్రికెట్‌కు తగ్గ స్థాయిలో మన సెలెక్టర్లు లేరనేది తన అభిప్రాయమని తెలిపాడు.