శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (12:26 IST)

ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌... చాహల్‌కు నో ఛాన్స్.. రియాక్షన్ వైరల్

Yuzvendra Chahal
వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు దక్కింది.
 
వన్డే వరల్డ్ కప్‌లో కూడా కుల్దీప్ తర్వాత మరో ఆప్షన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకానీ, చాహల్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక తాజాగా ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీసుకు జట్టును ప్రకటించారు. దీనిలో కూడా చాహల్‌కు చోటు దక్కలేదు.
 
అయితే దీనిపై చాహల్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా నవ్వుతున్న స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. ఈ పోస్టును నెట్టింట వైరల్ అవుతోంది.