శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 2 జులై 2014 (12:08 IST)

పేసర్ల విజృంభణ.. టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్!

వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో టెస్టులో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. పేసర్లు టిమ్ సౌథీ (3/28), బౌల్ట్ (3/48) విజృంభించడంతో వెస్టిండీస్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్ 53 పరుగుల విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 308 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 82.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 317 పరుగులకు ఆలౌటైంది.