శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :చెన్నై , శనివారం, 1 జులై 2017 (01:31 IST)

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య  జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో విజయం భారత్‌వైపే మొగ్గు చూపుతోంది. తొలి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు తర్వాత కాస్త నిలకడ ప్రదర్శించి పరుగుల వేగం పెంచినప్పటికీ వరుసగా వికెట్లు కూలడంతో అపజయానికి చేరువవుతున్న స్థితి కనబడుతోంది. 
 
ప్రస్తుతం 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 125 పరుగులు చేసింది. టీమిండియా పేసర్లు పాండ్యా 2, ఉమేష్ 1 వికెట్లు పడగొట్టగా అశ్విన్, కులదీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టి  విండీస్ పరుగుల జోరుకు కళ్లెం వేశారు. 24 ఓవర్లలో 127 పరుగులు చేయవలసిన విండీస్‌కి ప్రస్తుతం జరుగుతున్నా ఆటతీరు చూస్తే చేదన కష్టమేననిపిస్తోంది. ఆరో వికెట్ కూడా కోల్పోవాల్సిన విండీస్ జట్టు అశ్విన్ వైడ్ వేయడంతో ఊపిరి పీల్చుకుంది.
 
అంతకుముందు స్లో పిచ్‌పై పరుగులు తీయడమే గగనమైపోయిన టీమిండియా జట్టు చివర్లో మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోనీ, కేదార్ జాదవ్ స్పూర్తిదాయకమైన ఆట తీరులో 4 వికెట్ల నష్టానికి 251 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. శిఖర్ ధావన్ 2, కోహ్లీ 11 పరుగులకే ఔటై వెనుదిరిగిన స్థితిలో టీమిండియా డిఫెన్సుకు పోవడంతో పరుగులు వేగం బాగా మందగించింది.

రహానే, యువరాజ్ నిలదొక్కుకోవడంతో ఒకమేరకు పరుగులు లభించాయి వీరిద్దరి ఔట్‌లో ధోనీ, కేదార్ జాదవ్ చివరి 8 ఓవర్లలో మెరుపులు కురిపించారు. ఒక దశలో 200 పరుగులు కూడ రావడం గగనమనుకున్న స్థితిలో వరుసు సిక్సర్లతో ధోనీ, కేదార్ విండీస్ బౌలర్ల పని పట్టారు.