సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (14:51 IST)

2019 వరల్డ్ కప్ ఆప్ఘనిస్థాన్ కుదేలు.. కంగారూల శుభారంభం

2019 వరల్డ్ కప్‌లో కంగారూలు శుభారంభం చేశారు. శనివారం జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఏడుద వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాపై ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా, స్టాయినిస్‌‌ల ధాటికి ఆప్ఘనిస్థాన్‌ 38.2 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. నజీబుల్లా జాద్రాన్‌ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 
 
అనంతరం ఆసీస్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (89 నాటౌట్‌; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ ఫించ్‌ (66; 49 బంతుల్లో 6×4, 4×6) సమయోచిత ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని ఆసీస్‌ 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. కాగా, ఆదివారం దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య లండన్‌లో మ్యాచ్ జరగనుంది.