ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (19:20 IST)

ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ..శిఖర్ ధావన్ అవుట్..

2019 క్రికెట్ ప్రపంచకప్ హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంగా ఎడమ చేతి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. చేతి వేలి గాయంతో తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమంటూ వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. 
 
కాగా ధావన్ టోర్నీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక ఆటగాడి కోసం బీసీసీఐ బాగా కసరత్తు చేసింది. చివరకు రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించింది. మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ ఒక్కసారిగా టోర్నీ నుండి నిష్క్రమించడం పట్ల కొంతమంది అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ ఇకపై ఆడే మ్యాచ్‌లలో ధావన్ స్థానంలో రిషబ్ పంత్ అందుబాటులోకి రానున్నాడు.