శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 జులై 2023 (08:23 IST)

భార్యపై దాడి చేస్తున్నాడనీ... కుమారుడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు.. ఎక్కడ?

fire
`
ప్రతి రోజూ మద్యంసేవించి వచ్చి తల్లిపై (తన భార్య) కుమారుడు దాడి చేయడాన్ని తండ్రి కుమారుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. అంతే.. తనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కుమారుడిని చెట్టుకు కట్టేసిన తండ్రి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
బెంగుళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తాలూకా వాణిగరహళ్లి గ్రామానికి చెందిన జయరామయ్యకు ఆదర్శ్ (28) అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవ పడుతుండటాన్ని చూసి, కుమారుడిని మందలించాడు. అప్పటికీ శాంతించకపోవడంతో కుమారుడిని పనస తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.