సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:23 IST)

భార్య ఖాతాలో భర్త రూ. 39 లక్షలు డిపాజిట్, తిరిగి వచ్చేసరికి డబ్బుతో సహా ప్రియుడితో జంప్

వాళ్లది ఎంతో అన్యోన్యమైన సంసారం. ఒకరిని విడిచి మరొకరు వుండరు. పిల్లలు కూడా కలిగారు. భార్యాపిల్లల కోసం ఆ భర్త పరాయి రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈమధ్యనే ఇంటికి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన అతడికి షాక్ తగిలింది. ఇంట్లో భార్యాపిల్లలు లేరు. మరో షాక్ ఏంటంటే... ఆమె ఖాతాలో వేసిన 39 లక్షల రూపాయలు కూడా లేవు. ఏమైంది?
 
వారిది బీహార్ రాష్ట్రం. 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహానంతరం వారిద్దరి జీవితం సంతోషంగా గడిచిపోయింది. నగరంలో ఒక ఇంటిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో తన గ్రామంలో వున్న పొలాన్ని అమ్మేసి ఆ భర్త తన భార్య ఖాతాలో రూ. 39 లక్షల డబ్బును జమ చేసాడు. కానీ భార్య ఐడియా వేరే వుందని అతనికి తెలియదు. భార్య నమ్మకద్రోహం చేసింది. తన ప్రియుడితో కలిసి డబ్బుతో ఉడాయించింది. ఆమె ఖాతాలో కేవలం 11 రూపాయలు మాత్రమే వదిలేసి తప్పించుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే షాక్ తిన్నాడు.
 
పాట్నాలో జరిగింది ఈ ఘటన. బ్రజ్‌ కిషోర్ సింగ్, భోజ్‌పూర్ బర్హరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బింద్ గ్రామానికి చెందిన ప్రభావతిని వివాహం చేసుకున్నాడు. బ్రజ్‌ కిషోర్ గ్రామంలోనే వ్యవసాయం చేసేవాడు. మరికాస్త ఆదాయం కోసం అతను వ్యవసాయం వదిలి గుజరాత్ వెళ్లి ఉద్యోగం సంపాదించాడు. గుజరాత్‌లో పనిచేస్తూ, అతను డబ్బును తన భార్య ఖాతాకు పంపేవాడు. అలా ఆమె కుటుంబాన్ని పోషించేది. ఇదిలావుండగా ఆమెకి పొరుగున నివశించే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ రోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. వీరి వ్యవహారం భర్తకు తెలియలేదు. తన భర్త ఇంట్లో లేకపోవడంతో ధైర్యంగా ఆ యువకుడిని కలవడానికి వెళ్లేది. వారిద్దరికీ శారీరక సంబంధం కూడా ఏర్పడింది.
 
మరోవైపు పిల్లల పైచదువు కోసం నగరంలో స్థిరపడాలని భార్య చెప్పిన ప్రభావతి మాటలను అంగీకరించి తన తండ్రి తనకిచ్చిన పొలాన్ని రూ. 39 లక్షలకి అమ్మాడు. భార్య ఖాతాలో డిపాజిట్ చేశాడు. బ్రజ్‌కిషోర్ ఆ తర్వాత గుజరాత్‌కి యధావిధిగా వెళ్లాడు. అతను తన భార్యాబిడ్డలను చూసేందుకు అక్కడ నుండి తిరిగి రాగా ఇంటికి తాళం వేయబడి వుంది. ఇంట్లో భార్య లేదు. ఈ విషయాన్ని ఇంటి యజమాని వద్ద వాకబు చేసాడు. తన భార్య ప్రభావతి కూతురుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోయిందని చెప్పాడు. తన భార్య ఖాతా బ్యాలెన్స్ చూడగా అందులో రూ .11 మాత్రమే మిగిలి ఉంది.
 
ప్రభావతి 26 లక్షలు ప్రేమికుల ఖాతాకు బదిలీ చేసింది. అకౌంట్‌లో డబ్బు లేకపోవడంతో భయపడిన బ్రజ్‌కిషోర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మొత్తం విషయం పోలీసులకు సమాచారం అందించాడు. విచారణలో, ప్రభావతి ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆమెతో పాటు అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.