బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:38 IST)

వ్యభిచారం చేయాలంటూ కుమార్తెను ఒత్తిడి చేసిన తండ్రి!

హైదరాబాద్ నగరంలో కన్న కుమార్తెపట్ల ఓ కసాయి తండ్రి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. కన్నబిడ్డను భిక్షాటన, వ్యభిచారం చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశాడు. ఈ విషయం బాలికా సంరక్షణ విభాగం అధికారులకు ఎవరో సమాచారం చేరవేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో 16 యేళ్ల బాలిక తన తండ్రిలో కలిసి నివసిస్తుంది. ఈ బాలికతో తండ్రి భిక్షాటన చేయిస్తున్నారంటూ గత నెల 28వ తేదీన చైల్డ్ లైన్‌కు ఒక ఫిర్యాదు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన బాలికా సంరక్షణా విభాగం అధికారులు... ఆ బాలికను ప్రభుత్వ సంరక్షణా గృహానికి తరలించారు. అయితే, ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో అనేక విషయాలను వెల్లడించింది. 
 
తన తండ్రి తనతో భిక్షాటన చేయించడంతో పాటు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారంటూ చెప్పింది. సంరక్షణా అధికారి సాల్మన్ రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.