శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 మే 2024 (09:14 IST)

అనాథ బాలికను చేరదీశారు.. పెంచి పెద్దచేసి అంగట్లో సరుకును చేశారు...

victim girl
హైదరాబాద్ నగరంలో తల్లిదండ్రులే కాదు బంధువులు కూడా లేని ఓ బాలికను ఓ మహిళ చేరదీసింది. ఆమెను పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆ యువతిని అంగట్లో సరకుగా మార్చేసింది. యూసుఫ్ గూడలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంట్లో జరిపిన ఆకస్మిక సోదాల్లో ఈ విషయం వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకృష్ణ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పశ్చిమ మండల టాస్క్‌పోర్స్‌ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో వారు ఆ ఇంటిలో సోదాలు చేశారు.  పాతికేళ్లు ఉన్న ఇద్దరు యువతులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీ చేయగా 14 ఏళ్ల బాలిక కనిపించింది. ఆమెను బాలిక సంరక్షణ విభాగ అధికారులకు అప్పగించి కౌన్సెలింగ్‌ చేశారు. 
 
నిర్వాహకురాలు లక్ష్మికి చిన్నప్పుడే దొరికితే తీసుకొచ్చిందని బాలిక అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించిందని, తాను అంగీకరించకపోతే తీవ్రంగా దాడి చేసేదని.. తాడుతో బంధించేదని, మాట వినలేదని జుత్తు మొత్తం కత్తిరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం అధికారులు బాలికను జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. లక్ష్మిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రహ్మత్‌నగర్‌లో తనకు చిన్నారి దొరికిందని, తీసుకొచ్చి పెంచుకున్నట్లు ఆమె వివరించింది.