ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:26 IST)

మహిళపై యువకుడు అత్యాచారం.. ఆపై ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించిన వైనం

rape demo
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై క్రూర అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 30 యేళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించాడు. రాష్ట్రంలోని ఝుమరియా టోలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా, దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమె ఇంటిలోకి అర్థరాత్రి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వా ఆమె పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. మహిళ జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్‌ను బాధితురాలి ఇంట్లోనే వదిలివేసి వెళ్లాడు. 
 
బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోర్వా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిన అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.