శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (15:31 IST)

మధ్యప్రదేశ్‌లో దారుణం : ఫ్యామిలీ సభ్యుల హతం.. ఆపై ఆత్మహత్య

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కుటుంబంలోని ఎనిమిది మందిని హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడాకు చెందిన 27 యేళ్ళవ్యక్తి ఎనిమిది రోజుల క్రితం వివాహమైంది. ఈయన తన ఫ్యామిలీలోని ఎనిమిది మంది గొడ్డలితో నరికి చంపేశాడు. మృతుల్లో కట్టుకున్న భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి కూడా ఉన్నారు. ఈ ఎనిమిదిమంది వరండాలో నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తామియా జనపద్ పంచాయతీ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామం మహుర్జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
 
నిందితుడి చిన్నాన్న తల్వీ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. 'దినేశ్ మా అన్న కొడుకు. అతను ఒక సంవత్సరం క్రితం మానసిక సమతుల్యతను కోల్పోయాడు. అయితే, చికిత్స తర్వాత అతను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. మేము అతనికి ఈ ఏడాది మే 21న వివాహం చేశాం. పెళ్లయిన కొన్ని రోజులకే అతనికి మళ్లీ మానసిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అతను తన భార్య వర్షా బాయి, అతని అన్న శర్వాన్, శర్వాన్ భార్య బారాతో బాయి, అతని తల్లి సియా బాయి, శర్వాన్ ముగ్గురు పిల్లలను చంపాడు. వారందరూ ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అదే సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి మా అక్కగారి కోడలు బయటకు వచ్చింది. చేతిలో గొడ్డలితో దినేశ్ ని చూసిన ఆమె అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే, అంతలోనే ఆమె కొడుకుని కూడా ఇతను గాయపరచాడు. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో దినేశ్ అక్కడి నుంచి పారిపోయి వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు" అని చెప్పాడు.