శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (19:34 IST)

పూజా స్కూల్ యజమానిని తమ్ముడు - మరదలు కలిసి చంపేశారు...

murder
ప్రొద్దుటూరులో పూజా పాఠశాల యజమాని రాజారెడ్డి మృతి కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు రాజారెడ్డి సోదరుడు, ఆయన మరదలేనని పోలీసులు తేల్చారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు చెప్పారు. ఈ వివరాలను ఏఎస్పీ శ్రవణ్ కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, కడప జిల్లా ప్రొద్దుటూరులోని పూజా స్కూల్ యజమాని రాజారెడ్డి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం వెల్లడైందన్నారు. 
 
రాజారెడ్డిని ఆయన తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు ప్రసన్న కలిసి హత్య చేశారని తెలిపారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీన హత్య జరిగిందని చెప్పారు. పాఠశాల ఆవరణలోనే గొంతునులిమి చంపేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసి, అనారోగ్యం అంటూ ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులకు డాక్టర్ వీరనాథ రెడ్డి కూడా సహకరించారని, ఈయన రాజారెడ్డికి గుండెపోటు వచ్చిందని సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.