ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (09:20 IST)

ప్రియుడి మోజులోపడి నిద్రమాత్రలిచ్చి భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?

murder
అక్రమ సంబంధానికి మరో ప్రాణంపోయింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత గొంతుకు వైరు బిగించి హత్య చేసింది. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జీవీఎంసీ రెండో వార్డు పరిధి వలందపేటకు చెందిన వంకా పైడిరాజు (34) అనే వ్యక్తి టైల్స్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈయనకు భార్య జ్యోతి (22)తో పాటు నాలుగేళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నాడు. గత నెల 29వ తేదీ రాత్రి పైడిరాజు భోజనం చేసి తన భార్యాపిల్లలతో కలిసి నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, జ్యోతి ప్రవర్తనపై పైడిరాజు అన్నకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుని విచారంచగా అసలు విషయం వెల్లడైంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస రావు (23)తో రెండు నెలల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ కలుసుకోవడం వీలుకాకపోవడంతో విశాలాక్షి నగరులో శ్రీనివాసరావు ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. 
 
ఈ క్రమంలో జ్యోతికి సీబీఐ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చినట్టు తప్పుడు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించాడు. దీంతో ఆమె ప్రతి రోజూ ఉద్యోగానికి వెళుతున్నట్టుగా ఇంట్లో చెప్పి.. శ్రీనివాసరావు గదిలో సాయంత్రం వరకు ఉండి వెళ్లేది. అయితే, ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలుసుకోవడం.. ఏకంగా భర్త పైడిరాజు అడ్డు తొలగించుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని భావించారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి జ్యోతి తన భర్త హత్యకు ప్లాన్ వేశారు. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన భర్త వడ్డించే భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచి భర్త గొంతుకు వైరు బిగించి చంపేశారు. పిమ్మట మృతదేహాన్ని తన స్నేహితుడి సాయంతో స్కూటర్‌పై తన కూర్చోబెట్టుకుని విశాలాక్షి నగరులోని తన గదిలో రాత్రంతా ఉంచాడు. ఆ మరుసటి రోజు శ్మశానానికి తీసుకెళ్లి అనాథ శవంగా చెప్పి శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ లోగా జ్యోతి తన భర్త కనిపించడం లేదని భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ప్రస్తుతం జ్యోతి, ఆమె ప్రియుడు శ్రీనివాస రావు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.