బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 జనవరి 2022 (16:50 IST)

పెళ్లాడుతానని నమ్మించి అత్యాచారం చేసాడు...

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అత్యాచారం చేశాడని ఓ మహిళ రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల యువతి అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల దుర్గా వరప్రసాద్‌తో స్నేహం కుదిరింది.

 
ఆ స్నేహాన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె అంగీకరించింది. అప్పటి నుండి చాలా సందర్భాలలో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఇటీవల ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, దుర్గా వరప్రసాద్ ఆమెను తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు.

 
ఇటీవల దారికాచి అతడిని అడ్డగించి పెళ్లాడాలంటూ నిలదీస్తే.... ఆమెను బెదిరించడమే కాకుండా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.