బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 మే 2023 (17:25 IST)

విజయవాడ: బీటెక్ విద్యార్థిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు, ప్రేమ వ్యవహారమా?

murder
విజయవాడ నగర శివారు ప్రాంతమైన పెనమలూరు మండలానికి చెందిన పెదపులిపాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు మాచవరం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
కాగా తమ కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఐతే బర్త్ డే పార్టీ జరుగుతుండగానే జీవన్‌కి ఫోన్ వచ్చిందని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఐతే ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో తెలియరాలేదు.
 
కాగా జీవన్ హత్య వెనుక ప్రేమ కారణం అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.