మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (13:27 IST)

రేపు మరోసారి ఒకే వేదికపై చంద్రబాబు - పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య మాట‌లయుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఊహించ‌ని విధంగా వీరిద్ద‌రు ఒకే వేదిక పైకి రానున్నారు. అదేంటి.. బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించే ప‌వ‌న్.. బాబుతో క‌లిసి ఒకే వేదిక పైకి రానున్నారా అంటూ ఆశ్య‌ర్య‌పోతున్నారా..? కానీ..ఇది నిజంగా నిజం.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... పద్మావతి ఘాట్‌లో నిర్వహించే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన‌బోతున్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు పారాయణం. కొద్దిరోజుల క్రితం మంగళగిరిలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమలోఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. కృష్ణానది తీరం పద్మావతి ఘాట్‌లో రేపు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం జ‌ర‌ుగ‌నుంది. 
 
అవధూత దత్తపీఠం మైసూర్ ట్రస్టీ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. లక్షమంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొంటారు. 900 మీటర్ల పద్మావతి ఘాట్‌లో 30 వరసల్లో భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేసారు. మ‌రి.. ఈ వేదికపైకి వ‌చ్చిన త‌ర్వాత బాబును చూసి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆస‌క్తిగా మారింది.