మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:15 IST)

జూ.ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తహతహలాడుతున్నారా?

ఏపీ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. దేశంలో తిరుగులేని శక్తిగా వున్న కాంగ్రెస్ పార్టీని అప్పట్లో కూకటివేళ్లతో పెకళించి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైఎస్సార్ తన పాదయాత్

ఏపీ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. దేశంలో తిరుగులేని శక్తిగా వున్న కాంగ్రెస్ పార్టీని అప్పట్లో కూకటివేళ్లతో పెకళించి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైఎస్సార్ తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చారు. అనంతరం ఆయన మరణించడం, రాష్ట్ర విభజన తదితరాలన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత వైఎస్సార్ వారసుడుగా జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వున్నారు. 
 
ఇక అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే... నందమూరి హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెదేపా కోసం పర్యటనలు చేసి ఊరూరా తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం గెలుపు అవకాశాలకు గండికొట్టింది. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య గ్యాప్ పెరగడంతో జూ.ఎన్టీఆర్ తెదేపా ప్రచారానికి దూరంగా జరిగారు. పవన్ కళ్యాణ్ సపోర్టుతో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. అధికార తెదేపాకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. 
 
2014 ఎన్నికల సమయంలో మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దఫా తెదేపాకు మద్దతుగా నిలుస్తారో లేదోనన్న అనుమానం వుంది. మరోవైపు నందమూరి హీరో జూ.ఎన్టీఆర్ ఇప్పటికే తెదేపాతో అంటీముట్టనట్లు వున్నారు. పైగా జై లవకుశ చిత్రంలో జై క్యారెక్టర్లో నటించిన ఎన్టీఆర్ డైలాగులు ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు విసురుతూ వుంటాడు. అధికారం కోసం తహతహలాడే పాత్రలో కనిపించాడు. చిత్రంలో జై క్యారెక్టర్ చూస్తే జూ.ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారా అనే అనుమానాలు కలగవచ్చు. మొత్తమ్మీద చూస్తే వచ్చే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ పోటీకి సిద్ధమవుతారేమో చూడాలి.