శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (11:09 IST)

జై లవ కుశ' చిత్రం ద.. ద.. ద.. దంచికొట్టింది

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున 3 గంటలకు బెనిఫిట్ షోలు పడ్డాయి

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున 3 గంటలకు బెనిఫిట్ షోలు పడ్డాయి. అంతేకాదు ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ ప్రదర్శితం కాగా అందరిది ఒక్కటే మాట మూడు భిన్న పాత్రలలో ఎన్టీఆర్ నటన అదరహో అని అంటున్నారు.
 
ఈ చిత్రం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ భారీ కటౌట్స్ ప్రదర్శించడంతో పాటు వాటికి పాలాభిషేకం చేస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ థియేటర్స్ దగ్గర అభిమానులు చేస్తున్న సందడి పండుగ వాతావారణాన్ని తలపిస్తుంది. అయితే బెనిఫోట్ షోలు చూసిన అభిమానుల టాక్‌ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కీ రోల్ పోషించి సినిమాకి అన్నీ తానై నిలిచాడని తెలుస్తుంది. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని చెబుతుండగా, బాబీ టేకింగ్, హీరోయిన్ల గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు. 
 
సినిమా స్టార్టింగ్‌లో జై, లవ, కుశల చిన్ననాటి సన్నివేశాలు చూపించగా, జై అనే పాత్రధారి సమాజంలో జరిగే కొన్ని అవమానకర ఘటనల వల్ల తన అభిప్రాయం మార్చుకుంటాడట. ఇక స్క్రీన్‌పై ఎన్టీఆర్ తొలిసారి కుశ పాత్రతో పరిచయం కాగా, ఆ తర్వాత లవ పాత్ర ఎంటర్ అవుతుంది. కమెడీయన్స్ బ్రహ్మజీ, ప్రభాస్ శీనుల సందడి మధ్య మధ్యలో అదిరిపోయిందనే టాక్స్ వినిపిస్తున్నాయి.
 
పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మధ్యలో జై పాత్ర పరిచయం కాగా, ఎన్టీఆర్ రావణ ఎంట్రీ అద్భుతంగా ఉందని తెలుస్తుంది. ఇంటర్వెల్ కి ముందు జై పాత్రని పరిచయం చేసి ఆ తర్వాత , అసలు కథ ప్రారంభమవుతుందట. ఇంటర్వెల్ తర్వాత మధ్యలో జై, లవ, కుశ ముగ్గురు అన్నదమ్ములు ఒకే చోట కలవడంతో ఆ ఫ్రేమ్ చూపరులకి కనువిందుగా ఉందని తెలుస్తుంది. 
 
రైతుకి సంబంధించిన కొన్ని ఎమోషన్ సీన్స్‌ని కూడా ఇందులో పొందుపరచారట. అయితే అన్నదమ్ముల మధ్య వచ్చిన విభేదాల కారణంగా జై పూర్తి వయోలెంట్‌గా మారి అభిమానులచే కేకలు పెట్టించాడట. చిత్రం క్లైమాక్స్ ఎమోషనల్ సీన్‌తో ఉంటుంది. మొత్తానికి జై లవకుశ చిత్రం ద..ద..ద.. దంచికొట్టింది అనేలా ఉంటుందట. ప్రపంచ వ్యాప్తంగా 2400కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా, తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.