సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (18:04 IST)

రోజాను ఓడించేందుకు వాణీ విశ్వనాథ్‌కు అక్కడ కన్ఫర్మట... మరి 'గాలి'?

సినీ నటి వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందులోను రోజా నియోజకవర్గం నగరి నుంచే పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. రోజాకు సరైన సమాధానం చెప్పాలంటే వాణి విశ్వనాథ్ కరెక్టుగా సరిపోతారన టిడిపి నేతలు భావిస్తున్నట్లు సమాచా

సినీ నటి వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందులోను రోజా నియోజకవర్గం నగరి నుంచే పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. రోజాకు సరైన సమాధానం చెప్పాలంటే వాణి విశ్వనాథ్ కరెక్టుగా సరిపోతారన టిడిపి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వాణి విశ్వనాథ్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం, రాగానే ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళాలనుకోవడం జరిగిపోయింది. ఇప్పటికే టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించిన వాణి విశ్వనాథ్ పార్టీలో చేరడం కన్నా స్థానం ముఖ్యంగా భావిస్తున్నారు. అందుకే యువనేత నారా లోకేష్‌తో సంప్రదింపులు ప్రారంభించారు.
 
టిడిపిలోకి కొత్త నేతలు వచ్చి పడుతున్నారు. ముందస్తు ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో కొంతమంది సీటును కన్ఫామ్ చేసుకొని మరీ రాజకీయ పార్టీలలోకి వెళుతున్నారు. అందులో నటి వాణి విశ్వనాథ్ కూడా ఉన్నారు. వాణి విశ్వనాథ్ ఇప్పటికే తిరుపతిలో తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. అయితే ఎప్పుడు చేరుతానని మాత్రం చెప్పలేదు. 
 
కానీ పార్టీలో చేరడం కన్నా తనకు పార్టీలో ముఖ్య పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం కావాలన్నదే ఆమె ఆలోచన. అందుకే మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం నారా లోకేష్‌తో వాణి విశ్వనాథ్ సంప్రదింపులు జరిపారు. నగరి నియోజకవర్గ సీటుతో పాటు టిడిపి మహిళా విభాగంలో ఒక మంచి పదవి కావాలని అడిగారట.
 
వాణి విశ్వనాథ్ లాంటి ప్రముఖ నటి పార్టీలో చేరితే వద్దనరు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచే ఎవరినైనా బాబు పార్టీలోకి తీసుకుంటారు. కానీ ఏ నిర్ణయమైనా బాబే తీసుకోవాలి. కానీ గత కొన్ని నెలలుగా కుమారుడు నారా లోకేష్‌ కూడా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అందుకే వాణి విశ్వనాథ్ లోకేష్‌ ద్వారా పార్టీలో చేరి పదవిని, సీటును దక్కించుకునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి వాణి విశ్వనాథ్‌కు సీటిస్తే ఎన్నో యేళ్ళుగా ఇక్కడే ఉన్న టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమనాయుడికి ఏ నియోజకవర్గం నుంచి సీటిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.