శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:58 IST)

పవన్ కూడా పగలబడి నవ్వుతారు... బాబు ఇలా కేసీఆర్ అలా... #WorldSmileDay

నవ్వడం ఓ భోగం... నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. అందుకే ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు అని కవి కూడా రాశారు. నవ్వుకు అంత శక్తి వుంది మరి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గరంగరంగా వున్నారు. కారణం తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ వీలు చిక్కి

నవ్వడం ఓ భోగం... నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. అందుకే ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు అని కవి కూడా రాశారు. నవ్వుకు అంత శక్తి వుంది మరి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గరంగరంగా వున్నారు. కారణం తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా బాగా నవ్వుతుంటారట. అది కూడా మామూలుగా కాదు... పగలబడి మరీ నవ్వుతారట. చూడండి ఇక్కడ ఎలా నవ్వుతున్నారో...
 
విషయం ఏమిటంటే... మనసారా నవ్వితే శరీరం లోపల అంగాలకు ఎంతో మేలు జరగుతుంది. శరీరం పైకి కినిపించే కండరాలు, ఇతర భాగాలకు మర్దన చేస్తే అవి బాగా పనిచేస్తాయి. కాని లోపల అంగాలకు మర్దన కుదిరేది కాదు. అటువంటి మర్దనను లోపలి అంగాలకు చేసేది నవ్వు. నవ్వుతో జీర్ణ వ్యవస్థ మెరుగుగా పనిచేస్తుంది. హాయిగా నవ్వితే ఒత్తిడికి కారణమైన హార్మోన్‌ల ప్రభావం రక్తంలో తగ్గిపోతుంది. నవ్వుతో రక్త ప్రసరణ, రక్తంలో ఆక్సిజన్ పెరగడంతో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. చూడిండి శిల్పాశెట్టి నవ్వు... 
 
రోజులో మొత్తం 100 సార్లు నవ్వితే 15 నిమిషాల వ్యాయామం అందించినంత లాభం అందుతుంది. కాబట్టి సహజంగా నవ్వగలిగిన శక్తి పెంచుకోండి. నవ్వుతూ జీవితం గడపండి. ఒక వేళ సహజంగా నవ్వు కుదరక పోతే ప్రతీరోజు నవ్వుకు సంబంధించిన టెలివిజన్ కార్యక్రమాలు. సినిమా బిట్స్ చూస్తుండండి. నవ్వించే శక్తి బాగా కలిగిన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం అలవరుచుకోవాలి. బ్రహ్మానందం చూడండి ఎంత ఆనందంగా నవ్వుతున్నారో... 
 
నవ్వు అనేది ప్రకృతి మనిషికి ఇచ్చిన ఓ ప్రత్యేకమైన వరం. ప్రకృతిలోని జీవరాశులలో నవ్వు అనేది కేవలం మానవునికి మాత్రమే సాధ్యం. మిగిలిన ప్రాణులకు అది అసాధ్యం. మనిషి మనస్ఫూర్తిగా నవ్వుకోగలడు. ఒకానొకప్పుడు నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే నవ్వుతూ మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఆ రోజంతా నవ్వుతూనే గడిపేస్తారంటున్నారు పరిశోధకులు. 
 
 
నవ్వడానికి మనం ఎలాంటి రుసుం కాని పన్ను కాని చెల్లించనక్కరలేదు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా నవ్వండి. నవ్వుతో మనసుల్లోని కల్మషం పూర్తిగా తొలగిపోతుంది. నవ్వుతో మనసు, శరీరంకూడా తేలికగా ఉంటుంది. ఇది మనిషికి ఓ ఔషధంలా పని చేస్తుంది. నవ్వుతో శరీరంలో మార్పులు సంభవిస్తాయని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్. లీ బర్క్ తెలిపారు.
 
*నవ్వడం వలన మనిషి శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను సక్రమమైన మార్గంలో ఉంచుతుంది. దీంతో ప్రకృతి పరమైన కిల్లర్ సెల్స్ ఏవైతే మనిషి శరీరంలో ఉత్పత్తి అవుతాయో అలాంటివాటిని నవ్వు వలన ఇవి నష్టపోతాయని ఆయన తెలిపారు. 
 
* నవ్వు అనేది మనిషి హృదయానికి మంచి వ్యాయామం. ఇది టీ సెల్స్ సంఖ్యలను పెంచుతుంది. నవ్వడంతో యాంటీబాడీ ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఏ సంఖ్యను బాగా పెంచుతుంది. ఇది శ్వాసక్రియలో జరిగే మార్పులు, ఇందులో వచ్చే వ్యాధి సంక్రమణను నిరోధిస్తుంది. 
 
*మనిషి నవ్వడంతో శరీరంలో పెరిగే ఒత్తిడిని తగ్గించే హర్మోన్స్ పెరుగుతాయి. నవ్వుతో ముఖం, గొంతుకు సంబంధించిన వ్యాయామం బాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. *నవ్వుకు ప్రతిగా ఇప్పుడు చాలామంది తమ ఇళ్ళల్లో లాఫింగ్ బుద్ధాను పెట్టుకుంటున్నారు. లాఫింగ్ బుద్ధాను అత్యధికులు గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇలా కనీసం లాఫింగ్ బుద్ధాను చూసైనా నవ్వుతారేమోనని. నవ్వుకున్న ప్రాధాన్యతను తెలిపేందుకు #WorldSmileDayను అక్టోబరు 6న జరుపుకోవాలని ప్రపంచం నిర్ణయించింది.