శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:19 IST)

ఇయర్ బడ్స్‌తో బ్యూటి చిట్కాలు...

చెవిలో ఉపయోగించుకునే ఇయర్ బడ్స్‌తో కొన్ని బ్యూటి చిట్కాలు. కనుబొమలు చేయించుకున్నప్పుడు కొంతమందికి వాటి దగ్గర మంట, నొప్పిగా ఉంటుంది. అటువంటి సమయంలో ఇయర్ బడ్స్‌ను ఆలివ్ నూనెలో ముంచి కనుబొమల మీద నెమ్మదిగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల కింద మచ

చెవిలో ఉపయోగించుకునే ఇయర్ బడ్స్‌తో కొన్ని బ్యూటి చిట్కాలు. కనుబొమలు చేయించుకున్నప్పుడు కొంతమందికి వాటి దగ్గర మంట, నొప్పిగా ఉంటుంది. అటువంటి సమయంలో ఇయర్ బడ్స్‌ను ఆలివ్ నూనెలో ముంచి కనుబొమల మీద నెమ్మదిగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల కింద మచ్చలు, వాపులు కనిపించకుండా ఉండేందుకు కన్సీలర్ వాడుతుంటాం.
 
ఆ కన్సీలర్ శుభ్రం చేసుకునేందుకు ఇయర్ బడ్‌ను వాడుకోవచ్చు. కాటుక పెట్టుకునేటప్పుడు సరిగా రాకపోతే దానిని తుడిచేందుకు ఇయర్ బడ్‌ ఉపయోగించవచ్చు. మేకప్ వేసుకునేందుకు బ్రష్‌లా వాడొచ్చు. 
 
ముక్కు, కనుబొమల మధ్యలో ఫౌండేషన్, పౌడర్ సరిగ్గా అంటుకోదు. అలాంటప్పుడు ఇయర్ బడ్స్‌తో ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. గోళ్ల రంగు వేసుకునేటప్పుడు ఒక్కోసారి చర్మం మీద రంగు అంటుకుంటుంది. అప్పుడు ఇయర్ బడ్‌తో దాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.