శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:23 IST)

ఆయిల్ స్కిన్‌ను తొలగించాలంటే..?

కొందరైతే అందంగా, ఫ్యాషన్‌గా కనిపించాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే కొన్ని కారణంగా అలా ఉండలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా, ఫంక్షన్స్‌ లోనైనా ఆకర్షణీయంగా కనబడాలంటే.. ముందుగా ఆయిల్ స్కిన్‌ను తొలగించాలి. అందుకు ఈ సిట్రస్ మాస్క్ వేసుకోండి. 
 
సిట్రస్ మాస్క్‌కు కావలసిన పదార్థాలు:
ద్రాక్ష రసం: అరస్పూన్ 
నిమ్మరసం: అరస్పూన్ 
యాపిల్ పండు: 1-2
గుడ్డు: తెల్లసొన 
 
30-40 ద్రాక్ష పళ్ళతో పైవన్నింటిని బ్లెండ్ చేసి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే ముఖంపై గల జిడ్డు తగ్గుతుంది. ఇంకా చర్మకాంతి పెరుగుతుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు.