1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By chitra
Last Updated : శనివారం, 21 మే 2016 (18:09 IST)

టొమాటో గుజ్జులో పాలను పట్టించి ముఖానికి పట్టిస్తే..

టొమాటోల గుజ్జులో పాలను కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతిలీనుతుంది. ఒక బౌల్‌లో టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో  ఓట్‌మీల్‌, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ఎండ తాకిడికి కమిలిన చర్మంలో నిగారింపువస్తుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టొమాటో రసం, మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. ఒక టొమాటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి గుణం ఉంటుంది.
 
టొమాటోలను గుజ్జుగా చేసి దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.