శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:09 IST)

వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌: సురక్షితంగా తెల్లజుట్టును కవర్‌ చేసే హెర్బల్‌ షాంపూ హెయిర్‌ కలర్

భారతదేశంలో ప్రతిష్టాత్మక హెయిర్‌ కలర్‌ బ్రాండ్‌, వాస్మోల్‌ తామిప్పుడు వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఆయుర్వేద వనమూలికలతో సమృద్ధి చేయబడిన షాంపూ హెయిర్‌ కలర్‌, వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు వేగవంతమైన రీతిలో తెల్ల జుట్టును కవర్‌ చేస్తుంది.
 
వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌ షాంపూ హెయిర్‌ కలర్‌లో వనమూలికలలోని అత్యుత్తమ  లక్షణాల చక్కదనం ఉంది. దీనిలో ఉసిరి, భ్రింగ్‌రాజ్‌, మెతి, మందార వంటి లక్షణాలు ఉండటంతో పాటుగా ఎలాంటి అమ్మోనియా ఉండదు. ఇది జుట్టు రంగు కోసం అత్యంత విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన అవకాశంగా నిలుస్తుంది. ఈ ఉత్పత్తి బ్లాక్‌ షేడ్‌లో లభ్యమవుతుంది మరియు అతి సరసంగా 20 రూపాయల ధరలో లభిస్తుంది.
 
హెయిర్‌ కలరింగ్‌ విభాగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మరియు సరికొత్త విభాగం షాంపూ హెయిర్‌ కలర్‌. ఇది వినియోగదారులకు పూర్తి సౌకర్యం అందించడంతో పాటుగా వేగవంతమైన ఫలితాలను సైతం అందిస్తుంది. వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌లో ఆయుర్‌ప్రాష్‌ లక్షణాలు, అత్యాధునిక సాంకేతికతలతో మిళితమై ఉంటాయి. తద్వారా కలరింగ్‌ అనేది అత్యంత సులభతరమైన పద్ధతి మాత్రమే కాదు, వినియోగదారులకు అతి సురక్షితమైన ప్రక్రియగానూ నిలుపుతుంది.
 
శ్రీ అశీష్‌ కె చాబ్రా, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హైజీనిక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ మాట్లాడుతూ, ‘‘వినియోగదారులకు అందుబాటు ధరలలో సురక్షితమైన, సహజసిద్ధమైన జుట్టు రంగు ఉత్పత్తులను వాస్మోల్‌ అందిస్తుంది. వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌ షాంపూ హెయిర్‌ కలర్‌తో మేము మా వారసత్వంను అత్యాధునిక, సృజనాత్మక సాంకేతికతలతో మిళితం చేసి మా అభిమానులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉత్పత్తులను అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అత్యంత విశ్వసనీయమైన హెయిర్‌కేర్‌ బ్రాండ్‌లలో ఒకటి వాస్మోల్‌. ఇది తమ వినియోగదారులకు నమ్మకమైన జుట్టు రంగు పరిష్కారాలను  దశాబ్దాలుగా అందిస్తుంది. మేము స్థిరంగా బ్రాండ్‌ను నేటి తరపు అవసరాలకనుగుణంగా పరిష్కారాలను అందిస్తూ పునరుద్ధరిస్తున్నాం. ఇది కేర్‌ ఫస్ట్‌ అనే మా సిద్ధాంతాన్ని ప్రతిధ్వనిస్తుంది మరియు స్వీయ సంరక్షణను మరియు ‘ఖుద్‌ కా భాయ్‌ ఖయాల్‌’ అనే మా ప్రచారం స్వీకరించడానికి ఇది మా వినియోగదారులను ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
 
తమ వినియోగదారులు ఎన్నో బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తుండటంతో పాటుగా తమ ప్రియమైన వారి సంరక్షణ కోసం ఎంత దూరమైన వెళ్తుంటారని ఈ బ్రాండ్‌ అర్ధం చేసుకుంది. అందువల్ల  అత్యుత్తమ కుటుంబ సంరక్షణను అందించడం ఆశ్చర్యకరమైన అంశమేమీ కాదు. తమ స్వీయ సంరక్షణ పరంగా తరచుగా రాజీపడుతుండటమూ ఈ కారణం చేతనే కనిపిస్తుంది. ఖుద్‌ కా భీ ఖయాల్‌ ప్రచారం ద్వారా, వాస్మోల్‌ ప్రతి ఒక్కరూ తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతుంటుంది. తమ ప్రియమైన వారి కోసం వారు కష్టపడుతుంటే, ప్రతి వాస్మోల్‌ ఉత్పత్తి వారికి అత్యుత్తమ సంరక్షణను అతి సులభంగా అందిస్తుందన్న భరోసా అందిస్తుంది.
 
సహజసిద్ధమైన పదార్థాలతో కూడిన అసాధారణ ఉత్పత్తి శ్రేణి పరంగా వాస్మోల్‌ బ్రాండ్‌ సుప్రసిద్ధమైంది. ఇవి కేవలం ప్రాచుర్యం పొందడం మాత్రమే కాదు, హెయిర్‌ కేర్‌ పరిశ్రమలో ఇవి మైలురాయిగా నిలుస్తున్నాయి.