శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (14:44 IST)

క్యాబేజీ వడలు ఎలా చేయాలో తెలుసా..?

సాధారణంగా చాలామంది క్యాబేజీతో కూర, వేపుడు, పులావ్ వంటి వంటకాలు తయారుచేస్తుంటారు. కానీ, ఈ వంటకాలు పిల్లలకు అంతగా నచ్చవు. కనుక వారికి నచ్చినట్టుగా.. వారు ఇష్టపడేలా.. క్యాబేజీతో వడలు ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
క్యాబేజీ తురుము - 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
శెనగపిండి - 2 కప్పులు
అల్లం పేస్ట్ - 1 స్పూన్
ఎండుమిరపకాయలు - 3
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - సరిపడా 
ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, క్యాబేజీ తురము, ఉప్పు, శెనగపిండి వేసి నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి గుండ్రంగా చేతితో ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చే రంగు వేయించి తీయాలి. అంతే క్యాబేజీ వడలు రెడీ..