ఫెంగ్‌షుయ్: పాత బట్టలను ఇళ్ల నుంచి తొలగిస్తే?
భారత వాస్తుకు చైనా ఫెంగ్‌షుయ్ శాస్త్రానికి దగ్గర సంబధాలున్నట్లు తేలింది. ఫెంగ్‌షుయ్ ప్రకారం వాస్తును వివిధ విభాగాలుగా విభజించటం జరిగింది. వీటి ప్రకారం గృహంలో పాటించాల్సిన ఫెంగ్‌షుయ్ టిప్స్‌ను పాటిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.
ఫెంగ్‌షుయ్ ప్రకారం దాని ప్రభావం చూపటానికి ఇంటిలోని పనికిరాని వస్తువులకు సంబంధముంది. ఇంట్లో పనికిరాని చెత్త ఉన్నట్లయితే ఫెంగ్‌షుయ్ ఫలితం కనిపించదు. కాబట్టి వాటిని తొలగించాలి. శాస్త్రం ఫలించాలంటే పాత బట్టలను ఇళ్ల నుంచి తొలగించాలి.
అలాగే ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి. చిరిగిపోయిన, వెలసిపోయిన ఫోటోలను తొలగించాలి. పాత పుస్తకాలు ఇంటిలో వేలాడతీయకూడదు. పగిలిన వస్తువులు, కొంతబాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచండని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. అప్పుడే ఫెంగ్ షుయ్ శుభ ఫలితాలనిస్తుందని వారు సూచిస్తున్నారు.