మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : శనివారం, 5 జులై 2014 (17:55 IST)

మీ పిల్లలు.. మీ మాట వినడం లేదా? ఇవిగోండి టిప్స్!

చాలా మంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఎలా చెప్పిన వినకుండా ఎదురు తిరుగుతుంటారు. చాలామందికి ఎంతో డబ్బు ఉన్నా పిల్లలను అదుపులోకి తీసుకోలేక ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. పిల్లలను ఆచరణలో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఫెంగ్‌షుయ్‌ అంటోంది. అవి ఏమిటో చూద్దామా...
 
ముందుగా మీ పిల్లలు నిద్రపోయే గది ఎదురుగా మెట్లు, టాయిలెట్ ఉందేమో చూసుకోవాలి. అలాంటి వాటి నుంచి వెలువడే ప్రతికూలశక్తుల ప్రభావం మీ పిల్లల్ని మొండి వారుగా తయారవవడానికి కారణమవుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
 
కాగా... పిల్లల గది మెట్లకెదురుగా ఉంటే వాటిని మార్చినట్లైతే మంచిఫలితం ఉంటుందని లేదా గదికి ఎదురుగా టాయిలెట్, మెట్లకు మధ్యలో ఒక విండ్‌చైన్ వేలాడగట్టినట్లైతె మీ పిల్లల్లో మార్పులు వస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. 
 
మీ పిల్లలను నేల మీద కాకుండా చాప, బెడ్‌మీద పడుకోపెట్టినట్లైతే సరైన చి ప్రవాహ శక్తితో... సంతృప్తికి లోనవుతారని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. మీ అబ్బాయి, అమ్మాయి పడుకునే, చదువుకునే గదిలో ఈశాన్యం వైపున ఒక చిన్న స్ఫటికాన్ని ఉంచినట్లైతే వారికి చదువులో తెలివితేటలు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.