శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జూన్ 2014 (17:52 IST)

ఇంట్లో మొక్కల్ని పెంచవచ్చా?

మీ ఇంటి స్థలం ఎక్కువ అయినప్పుడు పూల కుండీలను, చెట్లను పెంచడం మంచిదేనని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. ఈశాన్యంలోని వృక్షాలు ఇంటిలోని మహవారికి హానికరాలు. 
 
కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి బయటి స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు పైవిధంగానే ఉన్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. దుష్ఫలితాలు కలిగించగల ఏ దిశలో చెట్టున్నా దాని వైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మామూలు అద్దం పెట్టడం శ్రేయస్కరం.
 
కానీ మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదు అన్న అనుమానం వద్దు. ఇంట్లో మొక్కలు పెంచడం ఇంట్లో దోషమున్న చోట ఆక్సిజన్ నింపడమే. దోషంలోని విషవాయువును లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ అవి పీల్చుకుంటాయి. అలాగే ఒక దిశలో మొక్కలు పెంచితే ఆ దిశకు సంబంధించిన రంగు బల్బు పెట్టడం మరిచిపోకూడదు. 
 
ఇలా చేయడం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియకు కావాల్సిన వెలుతురును బల్బు ద్వారా మనం ఇస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. అందుకే కనీసం 21 రోజులయినా 24 గంటలూ బల్బులు వెలిగించి ఉంచాలన్న నియమం పెట్టారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.