నగదు రహితం ఎవరిని పోషించడానికి.. ఎవరి మేలు కోసం? పేటీఎం అంటే..!
ప్రస్తుతం అందరి నోటా వింటున్న మాట క్యాష్ లెస్.. అందరూ ఇదే పాట పాడుతున్నారు. క్యాష్ లెస్ అంటే నగదు లేకుండా కేవలం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లేదా, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేయడమన్న మాట.. ఈ నగద
ప్రస్తుతం అందరి నోటా వింటున్న మాట క్యాష్ లెస్.. అందరూ ఇదే పాట పాడుతున్నారు. క్యాష్ లెస్ అంటే నగదు లేకుండా కేవలం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లేదా, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేయడమన్న మాట.. ఈ నగదు రహిత లావాదేవీల ద్వారా ఎవరికి లాభమో ఒకసారి చూద్దాం.
మొదటగా పూర్వంలా నగదు చెల్లింపు ద్వారా ఉండే పద్దతి ఉండి ఉంటే ఒక 500 రూపాయల నోటు తీసుకుని వెంకన్న హెరిటేజ్ షాప్‌కి వెళ్ళాడు. దానిలో కూరలు కొన్నాడు. ఆ 500 నోటు తీసుకుని హెరిటేజ్ షాప్ వాడు కూరగాయలు వర్తకుని నుంచి కూరలు కొన్నాడు. కూరగాయలతను ఆ రూ.500 నోట్లతో ఎరువు షాపులో ఎరువులు కొన్నాడు. ఎరువుల షాపతను ఆ రూ.500నోటుతో ఎరువుల ఫ్యాక్టరీ వెళ్ళి ఎరువులు కొన్నాడు.
ఎరువుల ఫ్యాక్టరీ యజమాని ఆ రూ.500 నోటుతో ప్రతి రైతు నుంచి పత్తి కొన్నాడు. ప్రతి రైతు ఆ రూ.500 నోటుతో పిల్లల స్కూల్ ఫీజ్ కట్టాడు. స్కూల్ యాజమాన్యం ఆ రూ.500 నోటును బస్ డ్రైవర్‌కి ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రూ.500నోటు చిరిగి పోయే వరకూ అంటే సమారు రూ.10 వేల మంది చేతులు మారవచ్చు. ఈ లావాదేవీల్లో కొనుగోలుదారునికి కానీ, అమ్మకందారునికి కానీ ఎటువంటి అదనపు ఛార్జీలు పడవు. హాయిగా ఆ నోటుతో లావాదేవీలు జరుపవచ్చు.
అదే పై లావాదేవీలన్నీ కార్డ్ ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ జరిపితే ప్రస్తుతానికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని చెబుతున్నారు కానీ వాళ్లేమైనా మన బంధువులా.. ఉచిత సర్వీస్ చేయడానికి.. మనకి ఉచిత సర్వీస్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభమేమిటి.
ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతనైనా ప్రతి లావాదేవీ మీద రెండు శాతం సర్ ఛార్జీ వసూలు చేయడం తప్పనిసరి, ఇప్పుడు పైన చెప్పిన లావాదేవీలని పేటీఎం ద్వారా చేస్తే ఆ పేటీఎం సంస్థ ఎంత కమిషన్ వస్తుందో చూద్దాం.
500 రూపాయలకి 2% అంటే 10 రూపాయల చొప్పున
1.వెంకన్నకి ఛార్జి - 10రూపాయలు
2.హెరిటేజ్‌కి ఛార్జి - 10రూపాయలు
3.కూరగాయలతనికి - 10
4.ఎరువుల షాపుకి - 10
5.ఎరువుల ఫ్యాక్టరీకి - 10
6.కార్మికునికి - 10
7.బట్టల షాపుకి - 10
8.టెక్స్ టైల్ ఫ్యాక్టరీకి - 10
9.ప్రత్తి రైతుకి - 10
10.స్కూల్‌కి - 10
ఇలా రూ.500 నోట్లు 10 వేలమంది చేతులు మారితే అయ్యే ఛార్జీ మొత్తం 10,000x10=1,00,000
అంటే ఒక్క రూ.500 నోటుకి సుమారు లక్ష ఛార్జీల రూపంలో ఆ పేటీఎం మొదలైన సంస్థలకి అప్పనంగా చెల్లిస్తారు. కేవలం ఒక్క 500రూపాయల నోటుకే అంత డబ్బు చెల్లిస్తే మనకి చెలామణిలో ఉన్న 18వేల కోట్ల రూపాయలకి ఎంత చెల్లిస్తామో ఒక్కసారి ఆలోచించండి?
ఇదంతా ఎవరిని పోషించడానికి? దీని వల్ల లాభపడేదెవరు? నగదు రహితం పాట పాడుతున్న వారు ఎవరి మేలు కోసం ఈ పనిచేస్తున్నారు? వీళ్ళు ఇంతగా దిగజారి కార్పొరేట్లకు బానిసగిరీ చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.