గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:52 IST)

ఒక్క యేడాదిలో రూ.2 లక్షల కోట్లు కోల్పోయిన చైనా కుబేరుడు

చైనాకు చెందిన ఓ కుబేరుడు ఒకే ఒక్క యేడాదిలో ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయ(2700 కోట్ల డాలర్లు)లను కోల్పోయారు. అతని పేరు కొలిన్ హువాంగ్. ప్ర‌ముఖ‌ ఇ-కామ‌ర్స్ పిన్‌డుయోడుయో ఐఎన్‌సీ సంస్థ అధినేత అయిన హువాంగ్‌.. ప్రపంచంలో ఏ కుబేరుడూ కోల్పోనంత సంప‌ద‌ను కోల్పోయిన‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్ల‌డించింది. 
 
దీనికి కారణం ఇంట‌ర్నెట్ కంపెనీల‌ వ్యవహారశైలి, లావేదేవీలపై చైనా ప్రభుత్వం చాలా కఠినంగా నడుచుకుంటూ వస్తోంది. ఈ ఆంక్షల కారణంగా ఈయనతో పాటు.. ఇదే దేశానికి చెందిన ఎవ‌ర్‌గ్రాండ్ గ్రూప్ ఛైర్మ‌న్ హుయి కా యాన్ కూడా 1600 కోట్ల డాల‌ర్ల సంప‌ద కోల్పోయారు. 
 
చైనాలో ధ‌నిక‌, పేద మ‌ధ్య ఉన్న భారీ అంత‌రాన్ని త‌గ్గించే దిశ‌గా దేశంలోని ప్రైవేట్ కంపెనీల‌పై ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని, ఆక్షలు విధించారు. త‌మ లాభాల్లో మెజార్టీ వాటాను దాతృత్వానికే ఖ‌ర్చు చేయాల‌న్న‌ది ఈ ఆంక్ష‌ల సారాంశం. దీంతో పిన్‌డుయోడుయో లేదా పీడీడీ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ సంస్థ‌ల కంటే కూడా ఎక్కువ‌గా పీడీడీ సంస్థ న‌ష్టాల‌ను చ‌విచూసింది.