శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 5 మార్చి 2018 (18:17 IST)

పేరుకే కోటీశ్వరులు.. కానీ నాలుగు రోజులు అందుకు ఖర్చు పెడితే బికారులే....?

రాబిన్‌హుడ్ ఇండెక్స్.. ఇదేంటి అంటారా.. కొత్తగా 2018 సంవత్సరంలో ఈ వెబ్‌సైట్ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. అది కూడా ముఖేష్ అంబానీ గురించి. ప్రపంచంలోని సంపన్నులు వారి దేశాలను ఎన్నిరోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చ

రాబిన్‌హుడ్ ఇండెక్స్.. ఇదేంటి అంటారా.. కొత్తగా 2018 సంవత్సరంలో ఈ వెబ్‌సైట్ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. అది కూడా ముఖేష్ అంబానీ గురించి. ప్రపంచంలోని సంపన్నులు వారి దేశాలను ఎన్నిరోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అయితే రాబిన్‌హుడ్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది. 
 
భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదతతో 20 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలరట. జపాన్, పోలాండ్, అమెరికా, చైనాలోని దిగ్గజ సంపన్నులకు తమ ప్రభుత్వం ఈదడం చాలా కష్టమట. చైనాలో ఆలీబాబా అధినేత ప్రపంచంలోనే 16వ అతి పెద్ద సంపన్నుడు. అంత సంపన్నుడు తమ దేశంలోని ప్రభుత్వాన్ని కేవలం 4 రోజులపాటే నడిపించగలడట. ఇక అమేజాన్ అధినేత చెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమెరికా ప్రభుత్వాన్ని కేవలం ఐదురోజులు మాత్రమే ఆదుకోగలరట. ఇక బ్రిటన్ సంపన్నుడు క్యూబ్రోస్ వినార్ తమ ప్రభుత్వాన్ని కొన్ని గంటలు మాత్రమే నడపగలరట.
 
ఇక ఆసియాలోనే అత్యంత ధనవంతుడు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయిన ముఖేష్ అంబానీకి ఈ సంవత్సరం 77 వేల కోట్లు ఆదాయం వచ్చి చేరిందట. ఆయిల్ నుంచి టెలికాం వరకు ముఖేష్ కంపెనీలు రికార్డులు సృష్టిస్తుండటంతో ఆయన సంపద ఇలా పెరుగుతోందని వెబ్ సైట్ చెబుతోంది. ఇంత ఆస్తులు ఉన్నా తమ ప్రభుత్వాలను నడపడం మాత్రం ఈ సంపన్నులకు ఏమాత్రం సాధ్యం కాదన్నది దీన్నిబట్టి అర్థమైందా.