శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2019
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (13:01 IST)

దేశంలో కొత్తగా మరో 8 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

covid test kit
దేశంలో కొత్తకా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేరళ వెల్లడించిన 15 మరణాలతో సహా గడిచిన 24 గంటల్లో 45 మరణాలు రికార్డయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 7,591 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 9 వేలకుపైనే ఉంది. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. 
 
పాజిటివిటీ రేటు మాత్రం 4.58 శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 84,931(0.19 శాతం)కి తగ్గిందని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
2020 ప్రారంభం నుంచి 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న 9,206 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరడం సానుకూలాంశం.