బుధవారం, 9 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (17:46 IST)

బీర్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయ్?

అధిక మద్యపానం సమస్యలకు దారి తీస్తుంది. కానీ మిచందా తాగడం ద్వారా ఆరోగ్యానికి కొంత మంచే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్‌ను ప్రతి రోజు పరిమితంగా తీసుకోవటం వలన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది. ముదురు రంగు బీర్‌లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే కరిగే ఫైబర్ ఉంటుంది.
 
బీర్‌లో బి 12, ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బీర్ త్రాగని వారి కంటే త్రాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బీర్‌లో సిలికాన్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. అయితే మోతాదు మించితే మాత్రం బీర్‌తో ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.