1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:52 IST)

పండ్లతో పొంచివున్న దంత సమస్యలు జాగ్రత్త..!

ప్రతి రోజు పండ్లు తింటే అనారోగ్యం దరిచేరదని వైద్యులు తెలుపుతుంటారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా దంతాలకు మాత్రం సమస్యలను తెచ్చిపెడతాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఆ అధ్యయనంలో ఐదుగురిలో నలుగురు దంత వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. 458 మంది దంత వైద్యులను దీనిపై అధ్యాయనం చేస్తే ఈ విషయాన్ని వెల్లడించారు.
 
పండ్లు తినడం ద్వారా దంతాలపై ప్లేక్ పేరుకుపోయి ఇనామెల్ పాడవుతుందని దంత వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్ పండు పళ్లకు చాలా చేటు చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పండ్లు తిన్న వెంటనే నోరు పుక్కిలించడం తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలుపుతున్నారు.
 
ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండు పూటల బ్రష్ చేయడం వలన కూడా దంత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని వారు దంత వైద్యులు తెలుపుతున్నారు.