HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు
గత కొన్ని రోజులుగా భారతదేశంలో HMPV కేసులు పదిహేడు నమోదయ్యాయి. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తరచుగా చేతులు కడుక్కోండి.
మీ ముఖాన్ని తాకకుండా ఉండండి.
తుమ్ముతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు నోటికి అడ్డు పెట్టుకోవాలి.
రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి.
అనారోగ్య వ్యక్తుల నుండి దూరం పాటించండి.
రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దు.
వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం పెరుగుతుంది.
తరచుగా తాకిన ఉపరితలాలను క్రిమిసంహారకం చేయండి.
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.